Monday, November 25, 2024

‘నీ కుక్క‌ల్ని పంప‌డం కాదు జ‌గ‌న్‌రెడ్డి.. ద‌మ్ముంటే నువ్వే డైరెక్ట్‌గా రా’.. నారా లోకేష్ స‌వాల్‌

ఏపీలో పదో తరగతి పరీక్షల చుట్టూ ప్రస్తుత రాజకీయం తిరుగుతోంది. పరీక్షల నిర్వహణ నుంచి ఈ మ‌ధ్య ప్ర‌క‌టించిన రిజల్ట్స్ దాకా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు లీకేజీ, ప్రస్తుతం అతి తక్కువు ఉత్తీర్ణత శాతం వంటి అంశాల‌ను ఆ పార్టీ లీడ‌ర్లు ఎత్తి చూపుతున్నారు. విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ ఆటలాడుకుంటోందని ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఇక‌.. మొదటి నుండి పదో తరగతి విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న టీడీపీ అగ్ర నేత‌ నారా లోకేష నిన్న(గురువారం) నిర్వహించిన జూమ్ మీటింగ్ పొలిటిక‌ల్ హీట్‌ని మ‌రింత రాజేసింది.

పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్స్‌తో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జూమ్ ద్వారా ముచ్చటించారు. అయితే ఈ మీటింగ్ లోకి మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరికొందరు వైసీపీ నాయకులు ప్రత్యక్షమయ్యారు. ఇలా తమ జూమ్ మీటింగ్ లోకి అక్రమంగా చొరబడ్డారంటూ టీడీపీ మండిపడుతుంటే.. తమకు సమాధానం చెప్పలేకే మీటింగ్ ను అర్ధాంతరంగా ముగించారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ నాయకులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తాము నిర్వహించిన జూమ్ మీటింగ్ ఈ ఏడాది ఫెయిల్ అయిన వాళ్ల‌కే… ఎప్పుడో పది పరీక్షలు, పద్దతి తప్పిన వైసీపీ కుక్కలకు కాద‌ని కొడాలి నాని, వల్లభనేని వంశీకి నారా లోకేష్ చురకలు అంటించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే దద్దమ్మలుగా, చేతకానొళ్లలా వీడియోలోకి రావ‌డం ఏమిటి… దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ది వుంటే ప్రిజినరీ జగన్ కు చెప్పండి… రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ ఉచితంగా చెద్దామని… పదో తరగతి రిజల్ట్స్ తర్వాత జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ సన్నబియ్యం సన్నాసి, వంశీ ఏం సమాధానం చెబుతారు అని లోకేష్ మండిప‌డ్డారు.

అంతేకాదు ట్విట్టర్ వేదికన లోకేష్ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ”నీ వైసీపీ కుక్కల్ని పంపడం కాదు జగన్ రెడ్డి… స్వయంగా నువ్వే రా… పదో తరగతి పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా సాక్షి చానల్ లోనే చర్చించుకుందాం” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement