అమరావతి, ఆంధ్రప్రభ : తాజాగా విడుదలైన పది ఫలితాల్లో విద్యార్ధులు ఫైయిల్ కాలేదని ఇది విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించిన సర్కార్ ఫెయిల్యూర్ అని టీడీనీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. సోమవారం పది పరీక్షా ఫలితాలు విడుదలైన అనంతరం మీడియాకు విడుదల చేసి ఒక ప్రకటనలో నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాఠశాలలో ఒక విద్యార్ది కూడా పాస్ కాకపోవటం 20 ఏళ్ళల్లో అతి తక్కువగా ఉత్తీర్ణత నమోదు కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదో తరగతి కష్ట పడి చదివి పాసై ఉంటే విద్యార్ధుల కష్టాలు తెలిసేవని ఎద్దేవ చేశారు. పరీక్షల నిర్వాహణ నుంచి ఫలితాల ప్రకటన వరకూ అంతా అస్తవ్యస్తం , గందోరగోళమేనని విమర్శించారు. విద్య నేర్పించే గురువులు చదువులు చెప్పటం పక్కన పెట్టి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. నాడు-నేడు పేరుతో అధికార పార్టీ నేతలు రూ. 3 వేల 500 కోట్లు దోచేశారని లోకేష్ ఆరోపించారు. 2018 లో 94.48 శాతం ఉత్తీర్ణత ఉంటే ఇప్పుడు 67.26 శాతానికి దిగజారిందని ఇదే ప్రభుత్వం సాధించిన ప్రగ తని వ్యాఖ్యానించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపల పెట్టి దిగజారుడు ఫలితాలకు ప్రభుత్వం కారకమైందని విమర్శలు చేశారు.
దిగజారిన విద్యాప్రమాణాలు..
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారాయని దీనికి ప్రత్యక్ష నిదర్శనం పది ఫలితాలేనని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కే ఎస్ జవహర్ ధ్వజమెత్తారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పది పరీక్షల నిర్వాహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రశ్నా పత్రాలు లీకేజ్ తో విద్యార్ధుల భవిష్యత్ తో చలగాటం ఆడారని మండిపడ్డారు. నాడు-నేడు పేరిట రంగులు వేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం విడుదలైన ఫలితాలతో 2 లక్షల మంది విద్యార్ధుల భవితవ్యం అంధకారంగా మారిందని అన్నారు. నాణ్యమైన విద్యలో మూడవ స్ధానం నుంచి 19వ స్దానానికి రాష్ట్రం దిగజారిగిందని జవహర్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.