Monday, September 16, 2024

AP | శ్రీకృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అభినందనీయం..

కర్నూలు బ్యూరో : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణతత్వాన్ని ప్రచారం చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. సోమవారం కర్నూలులోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయంలో జగన్నాథ బలదేవుడికి, సుభద్రా మయికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను టిజి వెంకటేష్ నిర్వహించారు.. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు టిజి వెంకటేష్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

టిజి వెంకటేష్ మాట్లాడుతూ… కర్నూలు నగరంలో ఇస్కాన్ సంస్థ కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement