Wednesday, November 20, 2024

AP: ప్రజల కోసం నిత్యం పోరాడేది చంద్రబాబు కుటుంబమే.. బుద్దా వెంక‌న్న

వైసీపీ నేతలను వాళ్ళ కార్యకర్తలే తరిమికొట్టారు..
ప్రతిపక్ష హోదా లేకుండా దేవుడు స్క్రిప్ట్ రాశాడు..
జగన్ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే…
విమర్శించి, వేధించిన వాళ్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : నిత్యం రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం పోరాడేది చంద్ర‌బాబు కుటుంబ‌మేన‌ని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. జగన్ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడమే ఉత్తమం అన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారన్నారు. ఈ ఎన్నికలలో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారన్నారు. ఆరా మస్తాన్ ది కేవలం బెట్టింగ్ ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని చెప్పారు. ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీపై పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలే తరిమికొట్టారన్నారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫినిష్ చేస్తానని అన్నాడు. కానీ భగవంతుడు వైఎస్ ను లేకుండా చేశాడన్నారు. జగన్ కూడా చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడన్నారు. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈరోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నాడు అంటే మాకు అంతకంటే ఆనందం లేదన్నారు. పవన్ ను మూడు పెళ్లిళ్లు అని విమర్శించాడు. కానీ ఇప్పుడు జగన్ కు ఏక్ మీద మేకై కూర్చున్నాడనీ. అదీ పవన్ కళ్యాణ్ అంటే అని అన్నారు.

జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పోటీ చేసినా లోకేష్ కు వచ్చిన మెజార్టీ రాలేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. జగన్ బీసీల వ్యతిరేకి అని అన్నారు. జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందే. ఇంక జగన్ జీవితం జైలుకే అన్నారు. జగన్ మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్షలు పడతాయన్నారు. కానీ చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన ఈ కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేది లేదన్నారు. త్వరలోనే సజ్జల రామకృష్ణరెడ్డి జైలుకు వెళ్తాడన్నారు. 2024 జూన్ 4 న తెలుగుదేశం పార్టీ 2 వచ్చిందని, ఇప్పటి వరకూ ఉన్నది పార్ట్ 1. ఇంకో 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగు లేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement