Friday, November 22, 2024

ఉప్పెన‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొట్టుకుపోవ‌డం ఖాయం.. చంద్ర‌బాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందని, ఆ ఉప్పెనలో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు బాధల్లో ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు ? దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించడం లేదు ? అని నిలదీశారు. రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలేంటీ ? అకాల వర్షాలకు అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎక్కడ ? అని ప్రశ్నించారు.

దెబ్బతిన్న పంట ఎంత..? కొన్న ధాన్యం ఎంత? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోవడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్, ఇప్పుడు ఎక్కడ ముడుచుకుని కూర్చున్నాడు? అని ఆగ్రహించారు. 15 జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు? మా రైతన్నల పంట మునిగింది.. పరిహారం ఇవ్వండి! అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement