Thursday, January 2, 2025

ISRO | స్పేడెక్స్ సక్సెస్.. నింగిలోకి డాకింగ్ ఉపగ్రహాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేప‌ట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX) విజ‌య‌వంతం అయ్యింది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ లో భాగంగా నేడు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-60 రెండు (ఛేజర్ & టార్గెట్) ఉపగ్రహాల‌తో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, అంతరిక్షంలో స్పేస్‌క్రాఫ్ట్‌ను డాకింగ్ చేయడానికి, ఆన్-డాకింగ్ చేయడానికి సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రయోగం విజయవంతం కావ‌డంతో అమెరికా, రష్యా, చైనాల త‌రువాత ఈ టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది.

సోమవారం రాత్రి 10:15 సెకెన్లకు నిప్పులు చిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ సీ-60 నింగిలోకి దూసుకెళ్లింది. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక‌ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనే భారత్ కల సాకారం కావాలంటే, అంతరిక్ష నౌకల డాకింగ్, అన్-డాకింగ్ టెక్నాలజీ చాలా అవసరమని ఇస్రో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement