శ్రీహరికోట – భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నేడు ప్రయోగించిన పిఎస్ఎల్వీ సి-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.. ముందుగా నిర్దేశించిన కక్ష్యలోకి ప్రొబా 3 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది… ఈరోజు సాయంత్రం 4.04 గంటలకు పిఎస్ఎల్వీ సి-59 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్నినింగిలోకి పంపారు.. సూర్యునిపై కిరణాలు అధ్యయనం చేసేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మన రాకెట్ ద్వారా కక్ష్య లోకి పంపింది. .. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలలో ఆనందం వెల్లివిరిసింది.. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.. అలాగే విజయవంతంగా ఉప గ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం పట్ల ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇస్రో తదుపరి ప్రాజెక్టులపై మాట్లాడుతూ.. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక, చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని.. గగన్‌యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో మొదలవుతాయని ప్రకటించారు.