భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇవ్వాల మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ సబార్టియల్ (వీకేఎస్). ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవ్వాల ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటమిక్ ఎనర్జీ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరి కోటకు రానున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత చరిత్రలో ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపడం ఇదే ఫస్ట్‌టైమ్ అని మంత్రి అన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం ఉనికిని పెంచేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ సింగిల్ స్టేజ్ స్పిన్ స్టెబిలైజ్‌డ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ బరువు దాదాపు 545 కేజీలు. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం అది సముద్రంలో కూలిపోతుంది. ఈ మొత్తం ప్రయోగం 300 సెకన్లలో ముగుస్తుంది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. విక్రం సిరీస్ ఆర్బిటల్ క్లాస్ స్పేస్‌లాంచ్ వెహికల్స్‌లోని మెజారిటీ సాంకేతికతలను పరీక్షించేందుకు విక్రమ్-ఎస్ సాయపడుతుందన్నారు.