అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలోని పీజీ కళాశాలల్లోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ను నేటి నుంచి ఈ నెల 23 వరకు వరకు నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 17 మధ్య రిజిస్ట్రేష్రన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఈ నెల 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు ఈ నెల 20న అవకాశం కల్పించారు. ఇక ఈ నెల 22న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 23వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు..
ఏపీ ఐసెట్ 2023 హాల్‌టికెట్, ఏపీ ఐసెట్ 2023 ర్యాంకు కార్డు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీ-సీ), డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల మెమో, పదోతరగతి మార్కుల మెమో, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, కులధ్రువీకరణ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ/సీఏపి, మైనార్టీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు- కలిగి ఉండాలి.