Wednesday, November 20, 2024

ఇది వెనకడుగా.. రాజకీయ వ్యూహమా? ప్రభుత్వం ముందున్న ఆప్షన్లేంటి..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఇది జగన్ సర్కార్ వెనకడుగా భావించాలా? రాజకీయ వ్యూహమా అన్న కోణంలో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే.. సీఎం జగన్ ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్  చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.

ఏ కోర్టూ అడ్డుకట్ట వేయలేని విధంగా కొత్త బిల్లు రూపకల్పన కోసం మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కారు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక మండలిలో వైసీపీ ఆధిపత్యం రావడం , కోర్టుల విషయంలో అవగాహన రావడంతో ఈ సారి పకడ్బందీగా బిల్లు రూపకల్పన ఉండనున్నట్టు సమాచారం. విషయం ఏంటీ అంటే… కౌన్సిల్ లో బిల్ హోల్డ్ అయింది. సెలెక్ట్ కమిటీ కి రిఫర్ చేస్తున్నా అని చైర్మన్ అన్నారు. అది బిల్ ఫామ్ అవ్వలేదు.. ఆ కోణం లో కోర్ట్ లో దెబ్బ పడే అవకాశం ఉంది.. అందుకే ఫ్రెష్ బిల్.. ఇప్పుడు కౌన్సిల్ లో సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి ఆ అడ్డంకి కూడా ఉండదు.. అని చాలామంది భావిస్తున్నారు.. కాగా, రాజధాని ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జగన్ అసెంబ్లీలో ప్రకటించనున్నారని అధికార వర్గాల సమాచారం.

దీనికి ఏపీ ప్రభుత్వం ముందు 4 ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆప్షన్1 : న్యాయపరమైన చిక్కులు లేకుండా 3 రాజధానులకు కొత్త బిల్లు..

ఆప్షన్2 : సాంకేతికంగా 3 రాజధానులను ప్రస్తావించకుండా అధికార వికేంద్రీకరణ

- Advertisement -

ఆఫ్షన్3 : పూర్తిస్తాయి రాజధానిగా అమరావతి అని చెప్తూనే మిగతా ప్రాంతాల అభివృద్ధి

ఆష్షన్4: పరిపాలనా రాజధాని విశాఖ అని చెప్తూనే అమరావతిలో పాలనా వ్యవహారాలు

కాగా, మూడు రాజధానులు బిల్లును ఉపసంహరించుకోవడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 705 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయం అని తెలిపారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.. అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపై కోరుతుందన్నారు రామకృష్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement