- మణితేజాది ముమ్మాటికి రాజకీయ హత్యే
- వైసీపీలో క్రియాశీలకంగా మనీ
- ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చు రేపుతున్న టిడిపి
- కోడిపందాల గొడవ పేరుతో హత్య
- ఫారెన్సీ కి నిప్పులతో పోస్టుమార్టం చేయాలి
- అనుమానాల్ని నీవృత్తి చేయాలి
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
- మన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన నాయకులు
- అండగా ఉంటామని పూర్తి భరోసా
(నందిగామ ఆంధ్రప్రభ) : వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న మనితేజ ది ముమ్మాటికి రాజకీయ హత్య అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో టిడిపి రాజకీయ చిచ్చు పెడుతోందని కోడిపందాల పేరుతో మనీని హత్య చేశారని, తక్షణమే ఫారెన్సీ కి నిపుణులతో పోస్ట్మార్టం చేసి, వైసిపి కుటుంబ సభ్యుల అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి సంచలనం రేపింది.
మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందిగామ చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ,జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరారావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న వైసీపీ శ్రేణులు పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
కుటుంబానికి ఎల్లవేళలా వైసిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మణితేజ మృతి పై వైసిపి కిఅనేక అనుమానాలున్నాయనీ, మణితేజ కుటుంబం వైసీపీలో యాక్టివ్ గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారనీ తెలిపారు.
కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారనీ ఆరోపించారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారనీ అనుమానం వ్యక్తం చేశారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టమ్ చేసి,ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి… వారి పై మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే నని, జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం అని తెలిపారు. మణితేజ కుటుంబానికి చంద్రబాబు , పవన్,లోకేష్ సమాధానం చెప్పాలన్నారు.
రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నారని, మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ సిద్ధాంతమా అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ మణితేజ తల పై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోందనీ, మణితేజ మృతి పై మాకు అనేక అనుమానాలున్నాయన్నారు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలన్నారు.