కర్నూలు, ప్రభన్యూస్ : గత ఐదురోజులుగా కురిసిన వర్షాలకు ఇప్పటికే జిల్లాలో దాదాపు రూ.30 కోట్ల మేర పంట నష్టం వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు. తాజాగా మరో 40వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు తేల్చారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో వర్షం కురిసినా, శనివారం కొంత వెసులుబాటు ఇచ్చింది. దీంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో 24 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ నిపుణుల హెచ్చరికలు రైతులకు కొంత కంగారు పెడుతూనే ఉన్నాయి.
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పంటలలో వరితో పాటు ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ జేడీఏ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇప్పటికే గత ఐదు రోజులుగా జిల్లాలో వర్షం మూలంగా దెబ్బతిన్న పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో గత ఐదు రోజుల్లో రూ.30 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించిన అధికారులు తాజాగా జిల్లాలోని 29 మండలాల పరిధిలో దాదాపు 40వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital