Tuesday, November 26, 2024

ఆల‌యంలో అక్ర‌మాలు-శ్రీకాళ‌హ‌స్తిలో ఐదుగురు సిబ్బందిపై వేటు

ఆల‌య సిబ్బంది నిర్వాకంతో ఇబ్బందులు ప‌డుతున్న భ‌క్తులు వీడియోని చిత్రీక‌రించి పంప‌డంతో మొత్తం ఐదుగురిపై వేటు ప‌డింది. ఎన్నో బాధలు, మరెన్నో కోరికలతో ఆలయాలకు వచ్చి దేవుళ్లను మొక్కుకునే భక్తులు ఆలయ అర్చకులు, సిబ్బంది చేతివాటంతో మనస్తాపానికి గురవుతున్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు అర్చకులను అధికారులు సస్పెన్షన్‌, మరో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. భక్తుల నుంచి ముక్కుపిండి డబ్బులు అడుగుతున్న దృశ్యాలను కొందరు భక్తులు చిత్రీకరించి అధికారులకు పంపారు. వీటిని పరిశీలించిన అధికారులు వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement