(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ లోక్ సభకు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాద్ (చిన్ని) ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, దర్గాలో దువాలు, ఎన్టీఆర్ కు ఘన నివాళులు, పెద్దల ఆశీర్వచనాలు, స్నేహితుల అభినందనలు, పుణ్య దంపతుల విజయతిలకం, మహిళల మంగళహారతులు, అభిమాన సముద్రం నడుమ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పూర్తిగా మూడు జండాలతో నిండిన బందరు రోడ్డుపై తోడుగా కలిసి వచ్చిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ ఘట్టం అధ్యంతం అట్టహాసంగా సాగింది. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే పాటకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు డ్యాన్స్ లు వేస్తుంటే, కండువాను ఎగరేస్తూ చిన్ని సైతం వారిని మరింత ఉత్సాహపరిచారు.
విజయవాడ పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని శివనాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు గురునానక్ నగర్ లోని ఎన్టీఆర్ భవన్ లో కుటుంబ సమేతంగా కేశినేని చిన్ని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన తల్లి ఆశీర్వచనాలు తీసుకున్నా అనంతరం నేను శివనాద్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ లు ఘనంగా నివాళులు అర్పించి, ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. సుమారు 6 గంటలకు పైగా సాగిన ఈ నామినేషన్ ర్యాలీ చివరకు కలెక్టరేట్ వద్ద ముగియగా, నామినేషన్ పత్రాలను కేసినేని చిన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.