విశాఖలో ఐపీఎల్ సందడి మొదలైంది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ప్రకటించింది. వైజాగ్ లో జరగబోతున్న మ్యాచ్ లకి సంబంధించి క్రికెట్ అభిమానులు రెండు మ్యాచ్ ల కోసం కోసం టికెట్స్ పొందవచ్చు.
ఇందులో మొదటగా ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు మార్చి 24 ఉదయం 10:00 గంటలకు ఆన్ లైన్ లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
అలాగే మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్ 4, ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే పోరు కోసం ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు మార్చి 27న ప్రారంభమవుతాయి. ఈ టికెట్స్ పేటియమ్, ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు మార్చి 31 న ఆన్ లైన్ లో టిక్కెట్లను ఆన్లైన్ లో కొనవచ్చు.
టికెట్స్ కొనుగోలు చేసే వారు ప్రతి మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేస్తున్న నిర్దేశిత కౌంటర్లలో వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. KKR మ్యాచ్ టిక్కెట్‌ల కోసం మార్చి 26న రిడెంప్షన్ ప్రారంభమవుతుంది, అయితే CSK మ్యాచ్ కోసం, టిక్కెట్ రిడంప్షన్ మార్చి 27న ఉదయం 11:00 గంటలకు PM పాలెంలోని స్టేడియం ‘B’ గ్రౌండ్, విశాఖపట్నంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. రూ.7,500, రూ.5,000, రూ.3,500, రూ.3,000, రూ.2,500, రూ.2,000, రూ.1,500 మరియు రూ.1,000 రేట్లకి సంబంధించి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.