Tuesday, September 17, 2024

Invitation – బాలయ్య 50 ఏళ్ల సినీ ప్ర‌స్ధానం – చంద్ర‌బాబుకు సినీ పెద్ద‌ల ఆహ్వానం

సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదిన గ్రాండ్ గా వేడుక‌
సానుకూలంగా స్పందించిన చంద్ర‌బాబు

నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ , తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , నిర్మాత కె. ఎల్. నారాయణ , నిర్మాత జెమినీ కిరణ్ , నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు త‌దిత‌రులు హైద‌రాబాద్ లో ఉన్న చంద్ర‌బాబుని నేడు క‌లిశారు.. ఈ వేడుక‌కు రావాల్సిందిగా సిఎంకు ఆహ్వాన‌ప‌త్రం అంద‌జేశారు.. దీనికి చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించారు.. అలాగే ఇండస్ట్రీ సమస్యలను, విశేషాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు సీఎం ..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement