Friday, November 22, 2024

Invitation – 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ … విజ‌య‌వాడ‌కు త‌ర‌లిరండి…

కడప – ప్రభ న్యూస్ బ్యూరో – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం కడప ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కనీవిని ఎరుగని విధంగా చరిత్రాత్మకమైన స్వరాజ్ మైదానంలో 20 ఎకరాలలో 400 కోట్ల రూపాయలతో 125 అడుగుల ఎత్తు ఉన్న డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు.

విగ్రహంతో పాటు 3,000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాల్, ఓపెన్ థియేటర్, లైబ్రరీ, ధ్యానం కోసం ప్రత్యేక హాల్, , గ్రీనరి ఏర్పాటు చేసి అద్భుతమైన కళాఖండంగా ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతోనే దేశంలో ప్రజలు స్వేచ్ఛగా, సమానత్వంగా ఉన్నారని, ప్రపంచంలో అంబేద్కర్ స్థానం ఎంతో గొప్పదని, ఆయన మహోన్నత వ్యక్తి అన్నారు. అంబేద్కర్ అందరివాడు అన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు, అతీతంగా ఈ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, సమాచార శాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి, సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement