గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు . మంగళగిరి జనసేన కార్యాలయం లో నేడు పవన్ తో దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని పవన్‌కు వివరించారు. అలాగే సినిమా టికెట్ రేట్ల అంశంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపైనా చర్చించారు.
పుష్ప-2 సినిమా రిలీజ్ నేపథ్యంలో సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపైనా పవన్‌కు దిల్ రాజు వివరించినట్లు సమాచారం . ఇదే విషయంలో టికెట్ల రేటు పెంపు, తెలంగాణ ప్రభుత్వం అనుమతి, బెనిఫెట్ షోల రద్దుకు సంబంధించిన అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు వార్తలు అందుతున్నాయి .