అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనేందుకు జాతీయ – అంతర్జాతీయ ప్రముఖులు తరలి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోడ్ షోలను ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించింది. ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పలు దేశాల రాయబారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు. ఏపీలో పెట్టు-బడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈగ్లోబల్ సమ్మిట్‌లో బిజినెస్-టు–బిజినెస్, బిజినెస్-టు–గవర్నమెంట్ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట, దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అడ్వాంటేజ్ ఆంధ్రా అనే పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. మెరైన్ ఉత్పత్తులు, ఆగ్రో ఫుడ్ ప్రోసెసింగ్, డిఫెన్స్ ఉత్పత్తులు ఈసమ్మిట్‌లో ప్రదర్శిస్తారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు హాజరుకానున్నారు. ప్రభుత్వం ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
ఈడీఎబీలో టాప్ :
గడిచిన మూడేళ్ల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీఓబీ)లో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. 11.43 శాతం వృద్ధి రేటు-తో మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా ఉంది. పెట్టు-బడులు రాబట్టటంలో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. అటు- సంక్షేమాన్ని కొనసాగిస్తూ…ఇటు- పెట్టు-బడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇవ్వనుంది. చంద్రబాబు నాయుడు హయాంలో సగటు-న రూ.11 వేల కోట్ల పెట్టు-బడులు వచ్చినట్లు- లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల వ్యవధిలోనే తాము సగటు-న రూ.12,702 కోట్ల పెట్టు-బడులు తీసుకొచ్చినట్లు- ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. రాష్ట్రంలో 38.5 శాతం తలసరి ఆదాయం పెరిగిందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్నామని తాజాగా ఢిల్లీ కేంద్రంగా పారిశ్రామిక వేత్తల సమావేశంలోనూ సీఎం జగన్ చెప్పారు. మూడేళ్లలోనే 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీ వేదికగా కూడా ఆయనస్పష్టం చేసారు. చంద్రబాబు హయాంలో 34 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చారు.
ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ :
సీఎం జగన్ మూడు రాజధానులపై కట్టు-బడి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో..కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారు. తీర్పు ఆలస్యం అయితే విశాఖకు క్యాంపు కార్యాలయం తరలించే ఆలోచనలో ఉన్నట్లు- తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి తాను త్వరలో విశాఖకు మారనున్నట్లు కూడా- వెల్లడించారు. ఇప్పటికే ఆయన సంక్షేమంలో పూర్తి స్థాయిలో పాస్ అయ్యారు. సంక్షేమం అంశంలో ప్రతిపక్షాలే ఆత్మరక్షణలోకి వెళ్లాయి. జగన్ ను మించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పటం మినహా.. లోపాలను ప్రస్తావించటానికి వారికి అవకాశం చిక్కటం లేదు. ఇదే సమయంలో అభివృద్ధి – పెట్టు-బడుల అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రం పారిశ్రామిక, పెట్టబడుల రంగంలో సాధించిన పురోగతిని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ సమయంలోనే విశాఖ కేంద్రగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కీలకంగా కనిపిస్తోంది.
వేడెక్కుతున్న వాతావరణం :
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీ-టె-క్కుతోంది. విశాఖ కేంద్రం రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. విశాఖ పరిపాలనా రాజధానిగా మంత్రులు పదే పదే చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమం గురించి ఎటు-వంటి విమర్శలకు అవకాశం లేదు. ప్రతిపక్షాలు నిత్యం అభివృద్ధి – పరిశ్రమలు – పెట్టు-బడుల గురించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇక ఇటు- ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో విశాఖ కేంద్రంగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కీలకం కానుంది. ఈ సదస్సులో నిర్ణయాలు..పెట్టు-బడుల ఒప్పందాలు ప్రధానంగా భావిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఇదే వేదిక నుంచి సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. విశాఖలో ఈ సదస్సు రాజకీయంగానూ కీలక మలుపుగా మారనుంది.