Saturday, January 4, 2025

Investments – ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్​ – క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు


కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు
ఐటీ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు
ఇన్నోవేషన్​ వర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు
ఫిజిక్స్​ వాలాతో కంపెనీతో కుదిరిన ఒప్పందం
ఏపీకి క్యూకట్టిన పలు దిగ్గజ కంపెనీలు
యూనిట్లు ఏర్పాటులో గూగుల్​ క్లౌడ్​, టీసీఎస్​
ఢిల్లీలో సీఎం చంద్రబాబు హైలెవల్​ భేటీ
శామ్‌సంగ్‌, ఫాక్స్‌కాన్‌, డిక్సన్‌ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చలు
సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానాల రూపకల్పన
సెమీ కండక్టర్​, డిస్​ప్లే ఫ్యాబ్​ పాలసీ అమలు
గూగుల్​ కంపీనీతో సీఎం చంద్రబాబు ఎంవోయూ
రెన్యూవబుల్​ ఎనర్జీ రంగంలోనూ భారీగా పెట్టుబడులు
అయిదేండ్లలో పెద్ద ఎత్తున ఉపాధికల్పన
డీప్​టెక్​ డెవలప్​మెంట్​తో యువతకు మేలు
సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 2024-29కి ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్ల్పే ఫ్యాబ్ పాలసీ, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్‌ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ, ఏపీ డేటా సెంటర్ పాలసీ అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసం విధానాల రూపకల్పన చేశారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా యావత్ పరిపాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు ఐటీ శాఖ చర్యలు చేపట్టింది. దీని కోసం గవర్నమెంట్ టు సిటిజన్ సేవలను మెరుగుపరచడానికి గూగుల్‌తో చంద్ర‌బాబు స‌ర్కారు ఎంవోయూ కుదుర్చుకుంది.

చంద్రబాబు వ్యూహం.. ఢిల్లీలో హైలెవల్​ భేటీ..

- Advertisement -

ఢిల్లీలో చీఫ్ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సీఎం చంద్ర‌బాబు ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలతో కూడిన సులభతర విధానాలను ఆయా కంపెనీ ప్ర‌తినిధుల‌కు వివరించారు. శామ్‌సంగ్‌, ఫాక్స్‌కాన్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌, హెవెల్స్‌ వంటి ప్రముఖ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతో జరిపిన చర్చలు చాలా వరకు సత్ఫలితాలనిచ్చిన‌ట్టు తెలుస్తోంది. కేవలం ఐటి, ఎలక్ట్రానిక్స్‌పైనే కాకుండా ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి..

రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ₹40 వేల కోట్ల పెట్టుబడుల పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది. రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయలతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దశలుగా రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో ₹లక్షా 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలర్ మిత్తల్ – నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ముందుకు వచ్చింది. కాగా, ఈ నెలలో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. అనకాపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికీ గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 60 వేల కోట్లతో 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మారుమూల ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ ఆఫీస్​ వర్షన్​ అప్​గ్రేడేషన్​..

యూనివర్సెల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద చేపట్టిన 3 ప్రాజెక్ట్‌ల కోసం మొబైల్ టవర్లు, రైట్ ఆఫ్ వేకు భూమి కేటాయింపులు, అనుమతులు మంజూరు చేశారు. గిరిజన, గిరిజనేతర మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ బ్లాక్ స్పాట్‌లను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్ అమలులో భాగంగా జీఏల జారీ రిజిస్టర్ పోర్టల్‌ను పునరుద్ధరించారు. ఈ- కేబినెట్‌ ప్రాజెక్ట్‌ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీ ఈ ఆఫీస్‌ 6.0 వర్షన్​ను 7.0కి అప్‌గ్రేడ్ చేశారు.

మరింత ఈజీగా పౌరసేవలు..

దీంతో పాటు కోర్ డ్యాష్‌బోర్డ్, స్కిల్ సెన్సస్, డేటా లేక్ వంటి వాటికి అవసరమైన ఐటీ వనరులను ఏపీ స్టేట్ డేటా సెంటర్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఐటీకి సంబంధించి అన్నివిభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ ఏజెన్సీ (APEITA)ని ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో విలీనం చేసేందుకు విధివిధానాలు ఖరారు చేశారు. ఏపీ ఐటీ అకాడమీని సైతం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనానికి ఏర్పాట్లు చేశారు. శాప్‌ నెట్‌ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిలో కలిపేందుకు చర్యలు చేపట్టారు. పౌరులకు సంబంధించిన 134 రకాల సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement