Friday, December 20, 2024

AP | ఓర్వకల్లు హబ్ లో పెట్టుబడులు: మంత్రి భరత్

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు పరిశ్రమలు ముందుకు వస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా సెమీ కండక్టర్ రంగంలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు పరిశ్రమ యాజమాన్యాలు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు. 2కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థతో సీడాప్ అవగాహన ఒప్పందాలు ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. స్వయం ఉపాధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఆదాయం కల్పించడం ఈ ఒప్పందాల లక్ష్యమని పేర్కొన్నారు. వీటి వల్ల పారిశ్రామిక వృద్ధితో పాటు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాయలసీమను ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement