Friday, November 22, 2024

ఇంధన పొదుపు రంగంలో ఏపీకి పెట్టుబడుల వరద

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఇంధన సామర్థ్య రంగంలో పెద్దఎత్తున పెట్టు-బడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే సూచించారు. దీనివల్ల పరిశ్రమలు, రవాణా, విద్యుత్‌, భవన నిర్మాణంవంటి కీలక రంగాలలో ఇంధన వినియోగ సామర్థ్యా న్ని మెరుగుపరచడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించడం తద్వారా ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనను మెరుగుపరచవచ్చునని తెలిపారు. అంతిమంగా ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడడమేగాక 2030 నాటికి ఒక బిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా దోహద పడుతుందని తెలిపారు. ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌, ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసిఎం)కు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్బన్‌ మార్కెట్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏపీఎస్‌ఈసిఎంను తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయవల్సిందిగా కోరారు.

దేశంలో 2031 నాటికి రూ 10.02 లక్ష కోట్ల మేర ఇంధన సామర్ధ్య పెట్టు-బడులకు అవకాశముందని తెలిపారు. ఇంధన సామర్ధ్య రంగంలో క్రీయాశీలకంగా వ్యవహరించే ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు- మరి కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఈ అవకాశాన్ని గుర్తించి తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇంధన సామర్థ్య పెట్టు-బడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని బీఈఈ డీజీ కోరారు. జాతీయ స్థాయిలో పరిశ్రమల రంగంలో రూ. 5.15 లక్షల కోట్లు-, రవాణా రంగంలో రూ. 2.26 లక్షల కోట్లు, గృహ నిర్మాణ రంగంలో రూ. 1.2 లక్షల కోట్ల మేర ఇంధన సామర్థ్య పెట్టు-బడులకు అవకాశముందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement