(ఆంధ్రప్రభ, విజయవాడ) : ఎన్.టి.ఆర్ జిల్లా లో జరుగుతున్నదొంగతనాలు లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించి నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని పోలిస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల తో డీసీపీ కే.తిరుమలేశ్వర రెడ్డి, క్రైమ్ ఏడీసీపీ ఎం.రాజా రావు పర్యవేక్షణలో సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్లు అబ్దుల్ సలాం, సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందం గా ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీన గొల్లపూడి కి చెందిన మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఈవెంట్ కొరకు తన యొక్క విలువైన కెమెరా (సుమారు Rs.5,00,000/- విలువైన) బాగ్ ను తీసుకొని ఒంగోలు వెళ్ళుటకు బస్సు స్టాండ్ కి వచ్చి ఒంగోలు బస్సు ఎక్కి కొంతదూరం వెళ్లి చూడగా అతని యొక్క కెమెరా బ్యాగ్ మిస్ అయినది. దీని పై కృష్ణలంక పోలీస్ లు నమోదు చేసి సిసిఎస్ పోలీస్కీ తదుపరి ఇన్వెస్టిగేషన్ పై కేసు ట్రాన్స్ఫర్ చేసారు.
ఈ క్రమంలో దొంగతనము కేసులు చూసే సిసిఎస్ బృందానికి రాబడిన సమాచారం మంగళవారం పాత గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సి.సి.ఎస్. సౌత్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సలాం సిబ్బంది తో కలిసి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాకి చెందిన వారు గా, వారి పేర్లు ఖాసీం, సారాల్ ఇసాక్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము వారిగా విచారణలో తెలిసింది.
వీరికి సరైన సంపాదన, డబ్బులు లేక ఎలాగైనా సులువుగా మార్గం లో డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేద్దామని నిర్ణయించుకొని ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ కి ట్రైన్ లో చేరుకొని అక్కడ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, ఒంగోలు కొన్ని ప్రాంతాలలో బృందాలు గా ఏర్పడి బస్సు లలో ప్రయాణికుల వలె వీరు కూడా ప్రయాణించి, ప్రయాణికులు యొక్క లగేజీ బాగ్ లను దొంగతనాలు చేస్తుంటారని విచారణలో బయటపడింది.
వీరు వద్ద నుండి దొంగతనం చేసిన విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు నేరాలు చేసే వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మిగతా ప్రాపర్టీ ని రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.గ