Saturday, October 5, 2024

Award | ఆంధ్రప్రదేశ్‌ సేద్యానికి అంతర్జాతీయ అవార్డు..

అంతర్జాతీయ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ సేద్యానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక ‘గుల్బెంకియన్‌ అవార్డు’ ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి వరించింది. ఏపీసీఎన్ఎఫ్‌తో పాటుగా ఈజిప్టుకు చెందిన సెకెమ్‌ స్వచ్ఛందసంస్థ, ఇండో అమెరికన్ సైంటిస్ట్ రతన్‍లాల్‌ను ఈ గుల్బెంకియన్ అవార్డు వరించింది.

పోర్చుగల్‌లోని లిస్బన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ టి.విజయ్‌కుమార్‌, మహిళా రైతు నాగేంద్రమ్మ నెట్టం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత సంతతి అమెరికన్‌ శాస్త్రవేత్త రతన్‌లాల్‌, ఈజిప్టుకు చెందిన సెకెమ్‌ స్వచ్ఛందసంస్థకూ అవార్డు లభించింది.

ఈ పురస్కారం కింద ఇచ్చే ఒక మిలియన్‌ యూరోల నగదు బహుమతిని ముగ్గురు విజేతలకు సమానంగా పంచనున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి ఏపీసీఎన్‌ఎఫ్‌ ఈ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డ్ ఏపీకి రావడం పట్ల సీఎం చంద్ర బాబు హర్షం వ్యక్తం చేసారు. అవార్డు గ్రహీతలు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024ని గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement