శ్రీశైలం – శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత వైసీపీ నాయకుడు ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు సమక్షంలో ఈ రోజు పార్టీలో చేరేలా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. శ్రీశైలం నుంచి భారీగా తన అనుచరులతో అమరావతికి కూడా బయలుదేరారు… అంతలోనే టిడిపిలో యువనేత ఏకంగా అధిష్టానానికి షాక్ ఇచ్చాడు..దీంతో చివరి నిమిషంలో నియోజకవర్గంలో సీన్ మారిపోయింది. నాయుడు చేరికను శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ చేరిక విషయంపై ఆయన ఒక ఆడియోను విడుదల చేశారు..
బొజ్జల సుధీర్‌రెడ్డి విడుదల చేసిన ఆడియోలో అమరావతిలో ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరుతున్నారని సమాచారం వచ్చిందని. ఒక ఇన్‌చార్జిగా నాకు కూడా ఆయన చేరిక విషయం అధికారికంగా తెలియదన్నాచ్చారు. ఎవరూ తనతో మాట్లాడలేదని పేర్కొన్నారు. బూత్‌స్థాయి మొదలుకుని టీడీపీ మండలాధ్యక్షులు, ఇతర నాయకులెవరూ రేపు అమరావతికి వెళ్లొద్దని ఆదేశించారు. వైసీపీ నుంచి అతను చేరుతున్నారు కాబట్టి, ఆ పార్టీ నుంచి వెళ్తారని చెప్పుకొచ్చారు. నేను చెప్పేది అర్థం చేసుకోవాలని. ఏది సరైందని అనుకుంటే అలా నడుచుకోవాలని కోరుకుంటున్నాని బొజ్జల సుధీర్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ ఆడియో వైరల్ కావడంతో టిడిపి అథిష్టానం పునరాలోచనలో పడింది..అమరావతి రావద్దని నాయుడుకి సందేశం పంపింది.. దీంతో ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో కొనసాగుతున్న ఎస్సీవీ నాయుడు కొంత కాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ఆయనతో పొసగడం లేదు. దీంతో నాయుడుకి టీడీపీ గ్యాలం వేసింది.. ఆయన చేరటంతో కాళహస్తితో పాటుగా సత్యవేడులో ప్రభావం చూపుతారని పార్టీ నేతలు అంచనా వేసారు. దీంతో ఆయన చేరికకు గ్రీన్ సిగ్నలో ఇచ్చారు.
చివరి నిమిషంలో బొజ్జల రంగంలోకి దిగడం ఆ ప్రక్రియ వాయిదా పడింది.. ఇరువురి నేతల మధ్య సంఖ్యత కుదిర్చేందుకు ఇద్దరిని ఈ నెల 14వ తేదిన తనను కుప్పంలోకలవవలసిందిగా చంద్రబాబు వారిని ఆదేశించారు..