ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవరెడ్డికి బుధవారం మధ్యంతర బెయిల్ దక్కింది. తన అమ్మమ్మ అనారోగ్యంగా ఉన్నందున ఆమెను చూసేందుకు బెయిల్ ఇవ్వాలని మాగుంట రాఘవరెడ్డి ఢిల్లీ హైకోర్టులో ఆరువారాల బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయమై ఆధారాలను రాఘవ కోర్టులో ఆధారాలను సమర్పించారు. అయితే మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేయవద్దని దర్యాప్తు సంస్థలు కోర్టులో వాదించాయి. అయితే మాగుంట రాఘవ అభ్యర్ధన మేరకు ఆరు వారాలకు బదులుగా రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఈడీ అధికారులు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement