ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి ప్రతినిధి – దేశంలో ఎక్కడా, ఎప్పుడు చూడని విధంగా.. ఏపీలో అక్కా చెల్లెమ్మలకు సొంత ఆస్తిని తమ ప్రభుత్వం సమకూర్చిందని ఒక అన్నగా.. తమ్ముడిగా ఎంతో గర్విస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఏపీలో పావలా వడ్డీపై ఇళ్ల నిర్మాణానికి రుణ సాయం పొందిన మహిళల ఖాతాలో వడ్డీ రీఎంబర్స్ మెంట్ నగదును విడుదల చేశారు. ఈమేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంనుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ర్టంలో 12.77 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈదఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రీయింబర్స్ కిందరూ.46.9 కోట్లు విడుదల చేశామని సీఎం జగన్ వివరించారు. ప్రతిప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు..
దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా..
గతంలో సుమారు 5.43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.54 కోట్ల పైబడి ఇచ్చామని, పావలా వడ్డీకేరూ.35 వేల మేరకు రుణాలను ఇస్తున్నామని వివరించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని, అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒక్కొక్క ఇంటికి రూ. 2.7 లక్షలు ఖర్చు అవుతుందని, మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోందన్నారు. ఇళ్ల నిర్మాణంకోసం, ఇసుక, ఇనుము, సిమ్మెంటు, ఇతర మెటీరియల్ ను ఉచితంగా ఇస్తున్నామని సీఎం వివరించారు. .
ఇంటి నిర్మాణ సామగ్రిపై కనీసంగా రూ.40వేలు సమకూరేలా మంచి జరిగేలాచూస్తున్నామని విశధీకరించారు. . ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టిప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ. 15 లక్షలవరకూ ఉంటుందని, అన్ని కలిపితే.. దాదాపు ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.-20 లక్షల వరకూ ఒక ఆస్తినిఅక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగామన్నారు. ఈ అవకాశాన్ని తనకు దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం” అని జగన్ తెలిపారు.