అమరావతి, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం 8వ తేదీ వరకు గడువునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత ఎలాంటి ఆలస్య రుసుముతో కానీ, తత్కాల్ విధానంలో కానీ ఫీజు స్వీకరించబోమని స్పష్టం చేశారు. 11వ తేదీ వరకు విద్యార్థులు, 12వ తేదీలోపు ప్రిన్సిపాల్స్ బోర్డుకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.