Thursday, November 21, 2024

AP | ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కర్నూలు బ్యూరో : పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు.. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిడుతూరుకు చెందిన మైనర్ బాలిక కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. బాలికను తెలంగాణ పెబ్బేరు మండలం వెంకటాయంపల్లికు చెందిన.. సమీప బంధువు అయిన యువకుడు పెళ్లి చేసుకోవాలని వేధించినట్లుగా చెబుతున్నారు.. బాలికకు యువకుడు సమీప బంధువు కావడంతో ఇద్దరికి వివాహం చేయాలని పెద్దల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

అయితే, అప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంలేని బాలిక.. ఇంకా చదువుకోవాలని, పెళ్లికి సమయం కావాలని చెబుతూ వచ్చింది.. కానీ, కర్నూలులో కంప్యూటర్ సెంటర్ వద్ద పెళ్లి చేసుకోవాలంటూ బాలికతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగాడు.. చదువు అవసరం లేదు పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది.. దీంతో విసిగిపోయిన బాలిక వాసమోల్ కొని నందికొట్కూరు బస్టాండ్ దగ్గర తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, బాలికను కర్నూలుకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement