Saturday, November 23, 2024

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు.. బంగారు, వెండి నగలు స్వాధీనం

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): మోస్ట్ వాంటెడ్, కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 25 లక్షల రూపాయలు విలువ గల బంగారు (513 గ్రాములు), (200 గ్రాములు) వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన తిరువీధుల మహేష్ (33), తిరుపతిలో ఉంటున్న కుంట్రపాకం మహేష్ (34)తో కలిసి దొంగతనాలు చేస్తున్నాడు.

తిరుచానూరు ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 దొంగతనాలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. రాష్ట్రంలోనే కాక తెలంగాణ, కర్నాటక, తమినాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సుమారు 200కు పైగా వీరిపై కేసులు నమోదైనట్టు తెలిపారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఆడిసినల్ ఎస్పీ క్రైమ్ విముల కుమారి, క్రైమ్ డీఎస్పీ సురేష్, సీఐలు శ్రీనివాసులు, చల్లని దొర, ఎస్సైలు రెడ్డప్ప, సుభాన్ నాయక్, సిబ్బందిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement