అమరావతి, ఆంధ్రప్రభ: బీసీ గురుకులాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఇందుకు ఇంటర్ ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఐ అండ్ పి.ఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులలో రాష్ట్రవ్యాప్తంగా వున్న 14 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో రెండవ సంవత్సరం 91శాతం ఉత్తీర్ణత, మొదటి సంవత్సరం 83.04 శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ద్వారా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ హాజరైన విద్యార్థులు 1498లో 1244 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారన్నారు. బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, థానం (బాలికలు) అనకాపల్లి జిల్లా సీనియర్ ఇంటర్మీడియట్లో 100 శాతం మరియు మొదటి ఇంటర్మీడియట్లో 97 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణతను సాధించారని వివరించారు.
ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ హాజరైన విద్యార్థులు 1336, అందులో 1212 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల దొరవారిసత్రం (బాలు) తిరుపతి జిల్లా సీనియర్ ఇంటర్మీడియట్లో 98.1 శాతం నిజాంపట్నం (బాలురు) జూనియర్ కళాశాల బాపట్ల జిల్లా బాలుర విభాగంలో మొదటి సంవత్సరంలో 93శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. జ్యోతిబా ఫూలే ఏపి బీసి సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ- ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన విద్యతో పాటు-, మెరుగైన విద్యాసదుపాయాలను, మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. ఫెయిల్ అయిన విద్యార్దులకు సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి ఫలితాలు కోసం కళాశాలలు ప్రత్యేక చర్యలు తీసుకుంటు-న్నాయని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.