Monday, November 25, 2024

AP | ఏపీలో ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ విడుద‌ల‌.. 90శాతం ఉత్తీర్ణ‌త‌

ఆంప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ వెలువ‌రించారు. 90శాతం మంది విద్యార్థులు పాస్ అయిన‌ట్టు మంత్రి బొత్స తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సి ఉండ‌గా.. కాస్త ఆల‌స్య‌మైంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. విద్యార్థులు bieap.apcfss.in. ap. అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోను ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది విద్యాశాఖ. ఫలితాల వివరాలను మంత్రి బొత్స మీడియాకు వెల్లడించారు.

►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత
►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్‌
►ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్‌

- Advertisement -

►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతోగుంటూరు జిల్లా సెకండ్‌
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్‌
►ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి

►ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత
►ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత

ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలి: మంత్రి బొత్స
►సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి
►ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి
►మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి
►విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. 4,84,197 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్టియర్‌, 5,19,793 మంది విద్యార్దులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి బొత్స పాల్గొన్నారు. అయితే సీఎం హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విద్యాశాఖ మంత్రి విజయవాడకు చేరుకోవడం ఆలస్యమైంది. ఈ కారణంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల ఆలస్యమయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement