ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు తమిళనాడు పోలీసులు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఆపరేషన్ నిర్వహించారు. దీనికి సంబంధించి డీజీపీ శైలేంద్ర బాబు ఆదేశాల ప్రకారం.. ఎన్ఐబీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 6వ తేదీన ఏపీలోని విశాఖపట్నం నుంచి తమిళనాడులోని వెల్లూరు వెళ్లే మార్గంలో 800 కిలోమీటర్ల పాటు తమ స్పెషల్ టీమ్ అనుమానిత ముఠాని ఫాలో అయ్యిందన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం ఎంతో సాహసం చేయాల్సి వచ్చిందని, దీనిపై తమ టీమ్ చాలా ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.
తమిళనాడుకు చెందిన నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ టీమ్.. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు అక్రమంగా 26 కిలోల గంజాయి రవాణ చేస్తుండగా తిరుపూర్‌కు చెందిన నిందితులను పట్టుకుంది. ముందుగా ఇంటెలిజెన్స్ టీమ్ వీరిని దగ్గర నుంచి ఫాలో చేసింది. వాళ్లు ముందుగా రైలులో తిరుపతికి వెళ్లి చిత్తూరు మీదుగా తిరుపూర్‌కు వెళ్లే బస్సు ఎక్కారు. పోలీసు బృందం నిఘా ఆధారంగా అనుమానితులైన వీరన్నన్, ఇతరులను ట్రాక్ చేస్తూ వచ్చింది. వేలూరు దాకా వారిని ట్రైన్ లో ఫాలో అయిన తర్వాత పోలీసులు వీరన్నన్ అతని భార్య పునీతను పట్టుకున్నారు. వారితో పాటు మరో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు. దీనిపై విచారణ చేయగా పోలీసులకు అనుమానం రాకుండా ఉండడానికే ఆ పిల్లల్ని వారితో పాటు తీసుకెళ్తున్నట్టు చెప్పారని పోలీసు అధికారి అగర్వాల్ తెలిపారు.
అయితే.. ఈ స్పెషల్ టీమ్ మరో నిందితుడు అయిన కదీర్ ని కూడా పట్టుకున్నట్టు స్పెషల్ ఆఫీసర్ అగర్వాల్ తెలిపారు. తిరుప్పూర్ 8 కిలోల గంజాయిని తరలిస్తుంగా కధీర్ ని పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదంతా డీజీపీ శైలేంద్ర బాబు ఆదేశాల మేరకు జరిగందని, ఎస్పీ రోహిత్ నాథన్ రాజగోపాల్ తో పాటు.. ఎన్‌ఐబీ ప్రత్యేక బృందంలో డీఎస్పీలు మురళి, రామచంద్రన్ తదితరులున్నారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital