Saturday, November 23, 2024

ఎపి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై నిఘా…

అమరావతి, ఆంధ్రప్రభ: క్రమశిక్షణ, నిబంధనల పేరుతో ప్రభుత్వం ఉద్యోగులను కట్టడి చేయనుంది. ఇందుకోసం ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై నిఘాను తీవ్రతరం చేయనుంది. ఈ నేపధ్యంలో పబ్లిక్‌ సర్వీసెస్‌ ఉద్యోగులకు సంబంధించిన డిసిప్లినరీ కేసుల వివరాలను డేటాబేస్‌ (డిసిడిబి) సమాచారాన్ని ఎపిసిఎఫ్‌ఎస్‌ ద్వారా కేసుల డేటాబేస్‌ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్లు (డిడిఒఎస్‌)ను ఆదేశించింది. గత కొంతకాలం గా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యోగ సంఘాల జెఎసిలు ఇప్పటికే కార్యక్రమాల షెడ్యూల్‌ ప్రకటించగా, మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి. ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందని గ్రహిం చిన ప్రభుత్వం క్రమశిక్షణ పేరుతో ఉద్యోగుల ను కట్టడి చేసేందుకు తాజా ఉత్తర్వులను తెర మీదకు తెచ్చిందని ఉద్యోగుల్లో చర్చ నడు స్తోంది. ఉత్తర్వులపై వచ్చి వారం రోజులు అయినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రెగ్యులర్‌ ఉద్యోగులకు సంబంధించి 14 అంశాలను ప్రొఫార్మాలో పూర్తి చేయాల్సి వుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు 18 అంశాలను పొందుపరచాల్సి ఉంటు-ంది. ఇందులో ప్రధానంగా ఎంప్లాయి ఐడి నెంబరు, ఎంప్లాయి పేరు. హోదా, ఉద్యోగి సస్పెండ్‌ అయ్యారా? లేదా? సస్పెండ్‌ అయ్యి ఉంటే ఎసిబి, విజిలెన్స్‌, డిపార్టుమెంట్‌, ఇతర కారణాలు అనేవి ప్రత్యేకంగా పేర్కొనాలి.

వీటితో ఆదాయానికి మించి ఆస్తులు కేసులు, లంచం అడగడం, ఇతరులను అవమానపరచడం, చీటింగ్‌, క్రిమినల్‌ నేరాలు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం, రూల్‌ కోడ్‌, కార్యాలయానికి ఆలస్యంగా విధులకు హాజరుకావడం, నడవడిక సక్రమంగా లేకపోవడం, క్రమశిక్షణ లోపించడం, ప్రతిఏడాదీ ఆదాయానికి సంబంధించి రిటర్న్స్‌ దాఖలు చేయకపోవడం వంటి కేసులను ప్రతి ఉద్యోగికీ సంబంధించినవి పూర్తి చేయాల్సి ఉంటు-ంది. వీటితోపాటు- ఉన్నతాధికారులు ఎప్పుడైనా నోటిసులు ఇచ్చిన వాటిపై సమాధానం ఇచ్చారా? లేదా చార్జీ మెమో ఇచ్చి ఉంటే ఆయా అంశం, క్రిమినల్‌ కేసులు నమోదవుతున్నాయా? ఒక వేళ ఏదైనా కేసుల్లో జోక్యం ఉంటే అందుకు సంబంధించిన -కై-మ్‌ నెంబరు, తేదీ, సంవత్సరం, పోలీస్‌ స్టేషన్‌ తప్పనిసరిగా డిడిఒలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటు-ంది.

సమాచారం నమోదుకు షెడ్యూల్‌ ఇదే..
ఈ నెల 8న ఎస్‌టిఒ, ఎటిఒ, స్టాఫ్‌ ఆఫ్‌ డిటిఅండ్‌ ఎఓ, పిఎఓ, డిడిఓలకు ఒకరోజు శిక్షణ, 10న ఫైళ్ల వెరిఫికేషన్‌, చెక్‌లిస్ట్‌ను పరిశీలించడం, 11న సిఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఆల్‌ డిడిఓలు, 12న డేటా స్కూట్రీ-్నని చేయాలి. ఎస్‌టిఓ,ఎటిఓ, స్టాఫ్‌ ఆఫ్‌ డిటిఅండ్‌ఎఓ, పిఎఓ,పిఎఓ, 15న వెరిఫికేషన్‌ అనంతరం డేటా అప్‌లోడింగ్‌ చేసి డ్యాష్‌బోర్డులో ఉద్యోగుల వివరాలు కనబడేలా చర్యలు చేపట్టాలని ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement