Wednesday, November 20, 2024

ఐఎన్ఎస్ విశాఖపట్నం.. లేటెస్ట్ టెక్నాలజీ మిస్సైల్ డిస్ర్టాయర్..


విశాఖపట్నం, ప్రభన్యూస్‌ :అంతర్జాతీయ నగరంగా గుర్తింపు సాధించడమే కాకుండా ,తూర్పు తీరంలో వ్యూహాత్మక రక్షణ ప్రాంతంగా మారిన విశాఖనగరం పేరిట కొత్తగా ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌక సిద్దమైంది. విశిష్ట గుర్తింపు కలిగిన విశాఖకు మరింత ప్రాధాన్యత కల్పించేలా ఆత్మనిర్భార్‌ భారత్‌ 15-బీలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై శత్రువుల పాలిట సింహస్వప్నంగా నిలువనున్న ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకను ఈ నెల 21న రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ముంబైలో జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్‌ఎస్‌ విశాఖ సేవలం దించనుంది.

ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలు విశాఖ పట్నం, మోర్ముగావ్‌, ఇంఫాల్‌, సూరత్‌ పేర్లు పెట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే తొలి నౌకను ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నంపేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరగగా, 2013 అక్టోబర్లో షిప్‌ తయారీ పనులను వై-12704 పేరుతో ముంబైలోని మజ్గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) ప్రారంభించింది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దీని బరువు 7,400 టన్నులు,పొడవు163 మీటర్లు, బీమ్‌17.4 మీటర్లు, డ్రాప్ట్‌ 5.4 మీటర్లు, వేగం గంటకు 30 నాటికల్‌ మైళ్లుకాగా, ఏకధాటిన 4 వేల నాటికల్‌ మైళ్ల ప్రయాణం చేయగలదు. ముఖ్యంగా సెన్సార్స్ , ప్రాసెసింగ్‌ వ్యవస్థలు కలిగి ఉండటంతో పాటు, మల్టీ ఫంక్షన్‌ రాడార్‌, ఎయిర్‌ సెర్చ్‌ రాడార్‌ కూడా వీటిలో ఉన్నారు. అంతేకాకుండా ఇక ఆయుధాలు విషయానికి వస్తే…32 బరాక్‌ ఎయిర్‌ క్షిపణులు, 16 బ్రహ్మోస్‌ యాంటీషిప్‌, ల్యాండ్‌ అటాక్‌ క్షిపణులు, 76 ఎంఎం సూపర్‌ రాపిడ్‌ గన్‌ మౌంట్‌, నాలుగు ఏకే-630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్‌ లాంచర్స్‌ నాలుగు, రెండు జలాంతర్గా మి వ్యతిరేక రాకెట్‌ లాంచర్లు ఉంటాయి. అంతేకాకుండా రెండు వెస్ట్‌ల్యాండ్‌ సీ కింగ్‌ విమానాలు రెండు హెచ్‌ఏఎల్‌ ధృవ్‌ విమానాల్ని తీసుకెళ్లగలదని, 50 మంది అధికా రులు, 250 మంది సిబ్బంది షిప్‌లో ఉంటారని నేవీ అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement