Tuesday, November 26, 2024

ఐఎన్ఎస్ వేలా.. ఆన్ డ్యూటీ..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: యుద్ధంలోనే కాకుండా..దేశాల నుంచి సమాచారం సేకరణలోనూ తనకు తానే సాటిగా పనిచేయనున్న ఐఎన్‌ఎస్‌ వేలా ముంబయిలో జాతికి అంకితం కానుంది. దీనిలో భాగంగా తూర్పు నావికాదళం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ముంబయి వేదికగా భారత నౌకాదళాపతి అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ కమిషనింగ్‌ చేయనున్నారు. ఆత్మనిర్భార్‌ భారత్‌ ప్రాజెక్ట్‌-75లో భాగంగా నావల్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ సహకారంతో మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ దీనిని నిర్మించింది. రెండు సంవత్సరాల సముద్ర ప్రయోగాల తర్వాత సిద్ధమైన స్కార్పిన్‌క్లాస్‌ సబ్‌మెరైన ఐఎన్‌ఎస్‌ వేలాని కమిషనింగ్‌ చేయనున్నారు.

ఇప్పటికే ప్రాజెక్ట్‌ -75లో ఆరు జలాంతర్గములు నిర్మిస్తుండుగా ఐఎఎన్‌ఎస్‌ వేలా నాలుగో సబ్‌మైరెన్ పూర్తిస్దాయిలో సీ ట్రయల్స్‌, బేస్‌ ట్రయల్స్‌ను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ముంబాయిలోని మజాగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ నిర్మించిన ఈ సబ్‌మెరైన్‌ని ఈ నెల 9వ తేదిన నౌకాదళానికి అప్పగించారు. డీజిల్‌, ఎలక్ట్రిక్‌ ప్రొపల్సన్‌ సిస్టమ్‌ రూపుదిద్దుకున్న ఈ వేలా జలాంతర్గామి నావికాదళానికి మరింత శక్తిగా మారనుంది. స్కార్పెన్‌క్లాస్‌లో అత్యంత ఆధునాతన జలాంతర్గాములలో వేలా ఒకటిని చెప్పవచ్చు.

శత్రువులకి చుక్కలు చూపించే సత్తా ఉన్న ఐఎన్‌ఎస్‌ వేలా యాంటీ సర్ఫేస్‌ వార్‌ఫేర్‌, ఇంటెలిజెన్స్‌ సేకరణ, మైన్‌ లేయింగ్‌తో పాటు ఏరియా నిఘా వంటి అనేక రకాల మిషన్‌లను చేపట్టగలదు. పశ్చిమ నౌకదళ కమాండ్‌లోని సబ్‌మెరైన్‌ నౌకాదళంలో మరింతగా సేవలందించనుంది. దేశీయ బ్యాటరీలతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గమి పొడవు 221 అడుగులు,ఎత్తు 40 అడుగులు,డ్రాఫ్ట్ 19 అడుగులు, బరువు 1.615 టన్నులు, ఎంటీయూ 12వి డీజిల్‌ ఇంజిన్లు, 4,360 బ్యాటరీ సెల్స్‌, డిఆర్‌డివో ఫ్యూయల్‌ సెల్‌ ఉంటాయి. ఎనిమిది నాటికల్‌ మైళ్ల వేగంతో 12వేల కి.మీ ఉపరితలంపైన, 1,020కి.మీ నీటిలో సుదీర్ఘంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా 50 రోజులు నీటి అడుగున ఉండగల సామర్థ్యం, 1,150 అడుగులలోతు వరకూ వెళ్లగలదు. దీనిలో ఎనిమిది మంది అధికారులు, 35 మంది సెయిలర్స్‌ ఉంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement