దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి విలయానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక వేల సంఖ్యలో కరోనా బాధితులు చినిపోతున్నారు. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, అత్యవసర ఔషధాలతో సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ నిన్న విశాఖపట్టణం చేరుకుంది. నౌక మోసుకొచ్చిన వాటిలో 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు, పీపీఈ కిట్లు ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు.
దేశంలో కరోనాతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం ‘’సముద్రసేతు-2’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలివెళ్లాయి. అందులో ఐరావత్ ఒకటి. వివిధ దేశాల నుంచి సేకరించిన ద్రవ ఆక్సిజన్, కొవిడ్ ఔషధాలను సేకరించి భారత్ కు తరలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కరోనా కోరల్లో మావోయిస్టులు