టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవ్వాల (శుక్రవారం) విచారణ జరిగింది. షెడ్యూల్‌ను మార్చాలన్న పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
టెట్, డీఎస్సీ పరీక్షలకు కనీసం నెల రోజుల సమయం ఇవ్వడం సముచితమని హైకోర్టు తాజాగా ప్రాథమిక అభిప్రాయాన్ని ఇచ్చింది. షెడ్యూల్‌లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో తగు ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి విచారణను వాయిదా వేసింది. దీనిపై ఇటీవల విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.