Friday, November 22, 2024

AP: పెగాసెస్‌పై పశ్చిమ బెంగాల్‌, హైదరాబాద్‌ల‌లో విచారణ.. ఇంకోసారి హౌస్‌ కమిటీ భేటీ

అమరావతి,ఆంధ్రప్రభ : టీడీపీ హయాంలో విపక్షాలపై నిఘా పెట్టేందుకు పెగాసెస్‌ సాప్టేn్వర్‌ వినియోగించారన్న ఆరోపణలపై వరుసగా రెండోరోజు బుధవారం హౌస్‌ కమిటీ- అధ్యక్షుడు భూమన కరుకరరెడ్డి అధ్యక్షతన కమిటీ- సమావేశం అసెంబ్లీ హాలులో జరిగింది. జూలై 5,6 తేదీల్లో మళ్ళీ హౌస్‌ కమిటీ సమావేశం నిర్ణయించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

సమావేశానికి హోమ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, ఐటీ- శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి హాజరయ్యారు. కమిటీ- అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్‌ వెళ్లి అక్కడ అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని హౌస్‌ కమిటీ ప్రతిపాదించింది. అలాగే ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా హైదరాబాద్‌ లోని ఒక సాప్టేn్వర్‌ కంపెనీ ప్రతినిధి రాష్ట్రంలోని ఓటర్లు, పించను దార్ల సమాచారాన్ని దొంగిలించారనీ దానిపై హైదరాబాద్‌ లో పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.

2016 – 2019 మధ్య కాలంలో అనధికారికంగా పెగసస్‌ స్పై వేర్‌ ఉపయోగించారని చంద్రబాబు పై ఆరోపణలున్నాయి. సమావేశానికి సభ్యులు భాగ్య లక్ష్మీ, కరణం ధర్మశ్రీ, మొండి తోక జగన్‌ మోహన్‌ రావు హాజరయ్యారు. సమావేశం అనంతరం కమిటీ- అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement