విజవాడ సబ్ జైలులో ఖైదీ అనుమానస్పద మృతి చెందాడు. తిలక్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం జైలులో తిలక్ కదలకుండా ఉండడాన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం అందించారు.
- Advertisement -
అప్రమత్తమైన అధికారులు తిలక్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే తిలక్ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. అనారోగ్య కారణాలతోనే తిలక్ మృతిచెంది ఉంటాడని అధికారులు భావిస్తు్నారు.. తిలక్ స్వస్థలం నూజివీడుగా గుర్తించారు. మరోవైపు తిలక్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.