Friday, November 22, 2024

కొవిడ్ వేళ – ప‌రిశ్ర‌మ‌ల అండ‌

అమరావతి, కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమలు ప్రజలకు అండగా నిలిచేందుకు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల పరిశ్రమల ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎస్‌ఆర్‌ నిధులను ప్రభుత్వానికి అందించా లనుకునేవారు సీఎమ్‌ఆర్‌ఎఫ్‌కి ఇవ్వొచ్చని లేదా పరిశ్రమ లున్న ప్రాంతాల్లోని ఆసుపత్రిలో వసతులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు తరహా సదుపాయాల కల్పనకు వినియోగించవచ్చన్నారు. ఇప్పటికే తన పిలుపు మేరకు సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తోన్న సూక్ష్మ, చిన్న మధ్యతరహా, భారీ పరిశ్రమలకు ఆయన అభి నందనలు తెలిపారు. తనవంతుగా కూడా రూ. 1.50 కోట్లు విరాళం ప్రకటిస్తున్నానని చెప్పారు. సామాజిక బాధ్యతను చాటిన పరిశ్రమలను గుర్తించి గౌరవించి చిరు సత్కారం, సర్టిఫికేషన్‌ అందిస్తామని మంత్రి వెల్లడించారు. పరిశ్రమ లకు కోవిడ్‌-19 మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో జీవో.ఆర్టీ నంబర్‌ 68 అమలు, ఉద్యోగులు,కార్మికుల రక్షణ , ఆక్సిజన్‌ సరఫరా, ఉత్పత్తి , సరకు రవాణాలో వస్తున్న ఇబ్బందులు, అత్యవసరాల తయారీ, ఫార్మా పరిశ్రమల వంటి అంశాలపై కూడా యాజమాన్యాలతో చర్చించారు.
అమరరాజా కోటి రూపాయల వితరణ
మంత్రి మేకపాటి పిలుపు మేరకు రూ.కోటి విరాళం ఇచ్చేందుకు అమరరాజ బ్యాటరీ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ నిధులతో చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా 500 బెడ్ల ఏర్పాటు-కు కషి చేస్తామని తెలిపారు. సాంకేతిక సహకారంలోనూ భాగస్వామ్యమవుతామని ఆ సంస్థ ప్రతినిధి విజయానంద్‌ మంత్రికి తెలిపారు. ఇదే కోవలో సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ప్రభుత్వానికి సహకరించేందుకు అనేక పరిశ్రమలు ముందుకొచ్చాయి. ఈనేపథ్యంలో సీఎస్‌ఆర్‌ నిధులకు సంబంధించిన ఏ విషయంలోనైనా సహకారం, విరాళం, వివరాలకోసం పరిశ్రమలు సంప్రదించడానికి స్టేట్‌ లెవల్‌ సీఎస్‌ఆర్‌ సెల్‌ ఏర్పాటు- చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ వెల్లడించారు.
పీఎస్‌ఏ ప్లాంట్ల-కు కేంద్రం అనుమతి
రాష్ట్రంలో నైట్రోజన్‌ నుంచి ఆక్సిజన్‌కు మార్చే 7 ప్లాంట్‌ ల ఏర్పాటు-కు కసరత్తు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రహణ్యం జువ్వాది వెల్లడించారు. ఒక పీఎస్‌ఏ ప్లాంట్‌ ఏర్పాటు-కు మామూలుగా నెల రోజులు పడుతుందని, కానీ మెటీ-రియల్‌ కొరత వల్ల ప్రస్తుతం కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
భూరి విరాళాలు
కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, కోవిడ్‌ రోగులకు బెడ్‌ల ఏర్పాటు-, ఆక్సిజన్‌గా మార్చే ప్లాంట్లు- స్థాపన, ఆక్సిజన్‌ క్రయోజెనిక్‌ ట్యాంకర్ల ఏర్పాటు-, పొరు దేశాల నుంచి ఆక్సిజన్‌ దిగుమతుల తరహా విషయాలలో భాగస్వామ్యాని కి రాష్ట్రంలోని పరిశ్రమలు స్వతంత్రంగా ముందుకు వచ్చాయి. 5 లీటర్ల సామర్థం కలిగిన 50 ఆక్సిజన్‌ కాన్సం ట్రేటర్లను వారంలోగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీకి అందించనున్నట్లు- వెల్లడించిన హిందుస్థాన్‌ యూనిలివర్‌ పరిశ్రమ ప్రతినిధి సతీష్‌ కుమార్‌ తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు కూడా విపత్తును ఎదుర్కోవడంలో తోడ్పాటు-నందిస్తున్నాయని ఏపీఐఐసీ ఎండీ రవీన్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. కర్నూలులోని రామ్‌కో కంపెనీ స్థానిక పీహెచ్‌సీల వసతులు, కోవిడ్‌ ప్రభావం ఉన్న ప్రాంతాలకు శాని-టైజేషన్‌ విషయంలో సహకరిస్తున్నట్లు- తెలిపారు. రూ. కోటి 11 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు- సీసీఎల్‌ ప్రాడక్ట్స్‌ ఇండియా లిమి-టె-డ్‌ తెలిపింది. రూ.75 లక్షల సిఎస్‌ఆర్‌ నిధులను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్లను నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు ఏర్పాటు- చేస్తున్నామని, 15వేల శాని-టైజ్‌ బాటిళ్లను అందించామని, రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చామన్న మరో కంపెనీ ప్రతినిధి గ్రోయెల్‌ పేర్కొన్నారు. విశాఖ పట్నం, చిత్తూరు, నెల్లూరు సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కార్పొరేషన్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ- ద్వారా అన్ని విధాల సహకారం అందించనున్నట్లు శ్రీసిటీ- ఎండీ రవి సన్నారెడ్డి తెలిపారు. ఆగస్ట్‌ నుంచి ప్రతి రోజూ 140 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నా మని తెలిపారు. వెనుకబడిన సత్యవేడు ప్రాంతం సహా శ్రీసిటీ- పరిసర ప్రాంతాలకు కోవిడ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు-కు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement