Monday, November 18, 2024

తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి – మంత్రి గౌతం రెడ్డి..

అమ‌రావ‌తి – తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 2030 నాటికి ఎగుమ‌తుల్లో రాష్ట్ర‌ వాటాను 10 శాతానికి పెంచ‌డం ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు వేస్తుంద‌న్నారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తూర్పు తీరంలో రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉండ‌టంతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పారిశ్రామిక అభివృద్ధికి అద‌న‌పు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు. ఈ అంశాల‌న్నింటిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మారిటైమ్ ఇండియ స‌మ్మిట్‌లో వివ‌రించార‌ని చెప్పారు. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌ల్లో ఉన్న తీర ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి విస్త‌ర‌ణ‌కు అవ‌కాశం తక్కువ ఉంటుంద‌న్నారు. 2023 డి‌సెంబ‌ర్ నాటికి రామాయంపాడు పోర్టు అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పారు. కేంద్రం కొత్త‌గా మారిటైమ్ పాల‌సీ-2030 తీసుకువ‌చ్చింద‌ని చెప్పారు. మారిటైమ్ నావిగేష‌న్ అండ్ మానిట‌రింగ్ యాప్‌ను కేంద్రం ఆవిష్క‌రించింద‌ని మంత్రి తెలిపారు. రామాయ‌ప‌ట్నం, భావ‌న‌పాడు, మ‌చిలీప‌ట్నం పోర్టుల ద్వారా అద‌నంగా 100 మిలియ‌న్ ట‌న్నుల కార్గో ర‌వాణా సామ‌ర్థ్యం పెంచ‌నుంద‌ని చె‌ప్పారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక న‌గ‌రాలు, ప‌రిశ్ర‌మ‌లు పెర‌గ‌నున్నాయ‌ని మంత్రి గౌతంరెడ్డి వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement