ఎన్టీఆర్ బ్యూరో – ఆంధ్రప్రభ ) విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిదంపతులు గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. పౌర్ణమి సందర్బంగా ఆదివారం ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామదేను అమ్మవారి దేవస్థానం నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో ఆలయ ఈవో కె ఎస్ రామారావు పూజలు నిర్వహించి, కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు.
వివిధ రకముల కళాకృతులు, నాట్యములు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇంద్రకీలాద్రి చుట్టూ అత్యంత వైభవంగా కొనసాగింది. గిరి ప్రదక్షిణలో భక్తులు విశేషముగా పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకొన్నారు.
- Advertisement -