( ఆంధ్రప్రభ విజయవాడ) : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఆలయాల్లో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి నగదు బంగారం వెండితో పాటు విదేశీ డాలర్లను కనుక సమర్పించారు.
అధికారులు భక్తుల సమర్పించిన హుండీల లెక్కింపును ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులు నిర్వహించారు. ఇప్పటికే రెండు దఫాలుగా హుండీ లెక్కింపు నిర్వహించగా సోమవారం మూడో రోజు పలు హుండీలను లెక్కించారు.
కగా, సోమవారం హుండీ లెక్కింపు సందర్భంగా… నగదు రూ. 3,05,96,971/- లు అమ్మవారికి భక్తులు నగదు రూపంలో కానుకలు చెల్లించుకున్నారు. కానుకల రూపములో బంగారం 321 గ్రాములు, వెండి 9 కేజీల 882 గ్రాములు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయి. విదేశీ కరెన్సీ లో యూఎస్ఏ 168 డాలర్లు, ఆస్ట్రెలియా 55 డాలర్లు, కువైట్ 41.5 దినార్లు, క్వతార్ 27 రియాల్స్, యూఏఈ 5 దిర్హమ్స్, మలేషియా 10 రింగేట్లు, సౌదీ -100 రియాల్స్ ను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు.
మొత్తం మూడు రోజుల హుండీ లెక్కింపు కలిపి నగదు రూ.9,26,97,047/- లు, కానుకల రూపములో బంగారం 733 గ్రాములు, వెండి 25 కేజీల 705 గ్రాములు అమ్మవారికి కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు విదేశీ డాలర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపు లో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో రత్న రాజు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు, ఆలయ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.