Monday, September 16, 2024

Indrakeeladri : పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా…
ప్రత్యేక హోమాలు, అర్చనలు, పూజలు


(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఈనెల 18వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిసాయి. కవిత్వ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక హోమాలు, పూజలు సాంప్రదాయ బద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్రోత్సవముల చివరిరోజు ఆలయ కార్యనిర్వాహనాధికారి కె.ఎస్ రామరావు సమక్షంలో వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ వైదిక సిబ్బంది, అర్చకులచే మండపారాధన పూజలు, సర్వప్రాయశ్చిత్త విధి తత్తత్ శాంతిక పౌష్టిక హోమములు, కూష్మాండ బలి నిర్వహించిన అనంతరం పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు.

తదుపరి కళాశోద్వాసన, మార్జన చేసి అందరికీ మహాదాశీర్వచనం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక, అర్చక సిబ్బంది, వేదపండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ… దేవస్థానంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవములు పూర్ణహుతి కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిసినవని తెలిపారు.

- Advertisement -

ఈనెల 23న దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతములు ఉదయం 07 గం. లకు ఆర్జిత సేవ గాను, అనంతరం 11 గం. లకు ఉచితముగాను నిర్వహించడం జరుగుచున్నదని, ఉచిత వ్రతం కోసం దేవస్థానం కార్యాలయంలో భక్తులు అప్లికేషన్లు పొందుచున్నారని తెలిపి, అందరూ ఈ అవకాశమును వినియోగించుకొని, అమ్మవారి అనుగ్రహం పొందగలరని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement