Tuesday, November 26, 2024

Indrakeeladri – దుర్గ‌మ్మ ఆల‌యంలో పాము… ప‌రుగులు తీసిన భ‌క్త‌జనం

విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గ అమ్మ వారిని ఆరాధించే భక్తులు కోట్లల్లో ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువని.. నమ్మిన భక్తులను నీడై కాచే తల్లి అని భక్తులు దుర్గమ్మను విశ్వసిస్తారు. దీనితో అమ్మవారి ఆలయం ఎప్పుడు భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఒక్కసారిగా ఓ పాము కలకలం సృష్టించింది. దీనితో అక్కడ పని చేసే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వివరాలలోకి వెళ్తే.. విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి ఆలయం లోని స్కానింగ్ సెంటర్ టికెట్ కౌంటర్లో పాము దర్శనమించింది. కాగా ఆ పాముని చూడగానే కౌంటర్లో ఉన్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

అనంతరం ఆలయ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. ఈ నేపథ్యంలో పాములు పట్టే వ్యక్తి ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ వ్యక్తి పాముని పట్టుకుని కొండ పైన వదులుతానని.. పాములను చంపకూడదని చెప్పారు. అనంతరం ఆ పాముని పట్టుకున్నారు. కాగా ఆ పాము విషం లేని పాము కావడం చేత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా పాములు పెట్టె వ్యక్తి పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పాముని ఆలయ ప్రాంగణానికి దూరంగా తీసుకు వెళ్లి కొండ పైన వదిలేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement