Tuesday, November 26, 2024

Indrakeeladri – దుర్గమ్మ హుండీలు లెక్కింపు – కానుకల రూపంలో రూ. నాలుగు కోట్ల ఆదాయం

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని కనకదుర్గమ్మ వారికి భక్తులు, పెద్ద ఎత్తున విరాళాలను బహుమతులను నగదు వెండి బంగారం సమర్పించుకుంటున్నారు. వీటితోపాటు విదేశీ డాలర్లను కూడా అమ్మవారికి కానుకల రూపంలో భక్తులు చెల్లించుకున్నారు. ఈనెల మూడవ తేదీ నుండి జరిగిన భవానీ దీక్షల విరమణ రోజు నుండి 11 రోజులపాటు ఉన్న అమ్మవారి హుండీలను ఆలయ అధికారులు లెక్కించారు.

ఇంద్రకీలాద్రిపై ఉన్న మహా మండపం ఆరవ అంతస్తులో శుక్రవారం నిర్వహించిన ఆలయ హుండీ లెక్కింపులో నగదు రూ. 1,38,15,854/- లు,కానుకల రూపములో బంగారం78 గ్రాములు, వెండి 8 కేజీల 425 గ్రాములు భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. గురువారం లెక్కింపులో నగదు రూ. 2,70,48,680/- లు,కానుకల రూపములో బంగారం 280 గ్రాములు, వెండి 18 కేజీల ను అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారు.

మొత్తం వెరసి (11 రోజులకు) నగదు రూ. 4,08,64,534/- లు,కానుకల రూపములో బంగారం 358 గ్రాములు, వెండి 26 కేజీల 425 గ్రాములు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయి. విదేశీ కరెన్సీలో యు ఏ ఈ 248 డాలర్లు, ఓమన్ 16 రియాన్ లు, కతారు 109 రియాల్స్, ఆస్ట్రేలియా 75 డాలర్లు, సింగపూర్ 2 డాలర్లు, యూ ఏ ఈ 40 దిర్హమ్స్, కువైట్ -11.25 దినార్లు, థాయిలాండ్ 140 బట్స్ ను భక్తులు అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించుకున్నారు.

హుండీ లెక్కింపు ను ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు, పాలకమండలి సభ్యులు, సహాయ కార్యనిర్వాహణాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ఎస్ పీ ఎఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, భవాణీ సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement