Friday, November 22, 2024

Indrakeeladri – కనకదుర్గమ్మ కి కానుకల పంట

.శరన్నవరాత్రి ఉత్సవాల్లో గణనీయమైన ఆదాయం..సుమారు 9 కోట్లు నగదు రూపంలో..కేజీ బంగారం.. 39 కేజీల వెండి..పెద్ద ఎత్తున విదేశీ డాలర్లు సమర్పించుకున్న భక్తులు…

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోవిజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయానికి కానుకుల పంట పండింది. అక్టోబర్ నెలలో నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున నగదు బంగారం వెండి విదేశీ డాలర్ల రూపంలో కానుకలను అమ్మవారికి సమర్పించుకున్నారు. అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహించగా తర్వాత నాలుగు రోజులపాటు భవానిలో విరుముడి కార్యక్రమం జరిగింది. ఈ రెండు శుభకార్యాల నిమిత్తం హుండీలను అధికారులు గడిచిన మూడు రోజులుగా లెక్కిస్తూ వచ్చారు.

మూడు రోజుల లెక్కింపులో భాగంగా నగదు రూపంలో రూ.8,73,53,943/- లను భక్తులు సమర్పించుకోగాకానుకల రూపములో బంగారం 994 గ్రాములు, వెండి: 38 కేజీల 395 గ్రాములు హుండీలో అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇక విదేశీ కరెన్సీ విషయంలో యు ఎస్ ఏ 351 డాలర్లు,హాంకాంగ్ డాలర్లు, కెనెడా 80 డాలర్లు,ఆస్ట్రేలియా 50 డాలర్లు, యూరో 10 యూరోలు,సింగపూర్ 7 డాలర్లు, న్యూజిలాండ్ 20 డాలర్లు, చైనా 1 యువన్, మలేషియా 5 రింగెట్లు, ఒమాన్ 300 బైసాలు, క్వతార్ 1 రియాల్, యూఏఈ 180 దిర్హమ్స్, కువైట్ 6 దినార్లు భక్తులు అమ్మవారికి కానుక రూపంలో సమర్పించుకున్నారు. ఆన్లైన్ అమ్మవారి ఈ హుండీ ద్వారా రూ.1,97,207/-లు విరాళముగా భక్తులు చెల్లించుకొన్నారు.

మూడు రోజుల నుండి జరుగుతున్న హుండీ లెక్కింపు ను ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి , ఎస్ పి ఎఫ్ I-టౌన్ పోలీసు సిబ్బంది హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement