Thursday, November 21, 2024

Indrakeeladri – 28 సాయంత్రం 6:30 నుండి 29 ఉదయం 9 గంటల వరకు ఆలయం మూసివేత..

విజయవాడ ప్రభ న్యూస్ – విజయవాడ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైన కనకదుర్గమ్మ దేవాలయం తో పాటు ఉప దేవాలయాలను ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. శోభ కృత నామ సంవత్సర ఆశ్రయిజ పౌర్ణమి అక్టోబర్ 28వ తేదీ శనివారం రాత్రి రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహము ఏర్పడుతున్న సందర్భంగా దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం సాయంత్రం 6:30 నిముషాల నుండి శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం, ఇతర ఆలయాల తలుపులు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

గ్రహణ మోక్షకాలం అనంతరం అక్టోబర్ 29 ఆదివారం ఉదయం 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయ ఉప ఆలయ యం లోని దేవతలకు స్నానాభిషేకాలు నిర్వహించి అనంతరం ఉదయం 9 గంటల నుండి ప్రతినిత్యం వలె భక్తులకు దర్శనం ప్రారంభించి, ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అక్టోబర్ 28 శనివారం సాయంత్రం అమ్మవారికి ప్రహోదకాల హారతులు నిర్వహించిన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఆలయ తలుపులు మూసివేసి సాయంత్రం నిర్వహించే నిత్య పల్లకి సేవ నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున నిర్వహించే ఆర్జిత సేవలైన సుప్రభాత, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన కూడా నిలుపుదల చేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఈవో భ్రమరాంబ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement