Friday, November 22, 2024

Indrakeeladri – శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో దుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒకటైన శ్రీమహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణి. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయనేది భక్తుల నమ్మకం.

తెలవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలో విశేష పూజలు, కుంకుమార్చనలకు భక్తులు భారీగా తరలివచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement